మరుగున పడిపోతున్న అరుదైన గొబ్బిళ్ళ పాట | పసుపున పుట్టావు గొబ్బెమ్మ! లిరిక్స్ | Pasupuna Puttavu Gobbemma Song Lyrics & Significance

 పసుపున పుట్టావు గొబ్బెమ్మ నీవు

సంక్రాంతి సంబరాల్లో గొబ్బెమ్మల పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ధనుర్మాసం నెలలో కన్యకలు భక్తిశ్రద్ధలతో పాడుకునే ఈ 'పసుపున పుట్టావు గొబ్బెమ్మ' పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ పాట లిరిక్స్ మరియు దీని విశిష్టతను ఇక్కడ తెలుసుకోండి.

Gobbemma puja is very important in Sankranti. This song is popular among young women in Dhanurmasam. Find the lyrics and significance here.



పసుపున పుట్టావు గొబ్బెమ్మ నీవు
పసుపున పెరిగావు గొబ్బెమ్మ నీవు
రాచకొండల మీద రాగాల మేన
నీ నోము నాకియ్యవే నాకొక్క వరమియ్యవే

కుంకాన పుట్టావు గొబ్బెమ్మ నీవు
కుంకాన పెరిగావు గొబ్బెమ్మ నీవు
రాచకొండల మీద రాగాల మేన
నీ నోము నాకియ్యవే నాకొక్క వరమియ్యవే

గాంధాన పుట్టావు గొబ్బెమ్మ నీవు
గాంధాన పెరిగావు గొబ్బెమ్మ నీవు
రాచకొండల మీద రాగాల మేన
నీ నోము నాకియ్యవే నాకొక్క వరమియ్యవే

అక్షతలు పుట్టావు గొబ్బెమ్మ నీవు
అక్షతలు పెరిగావు గొబ్బెమ్మ నీవు
రాచకొండల మీద రాగాల మేన
నీ నోము నాకియ్యవే నాకొక్క వరమియ్యవే

పుష్పాన పుట్టావు గొబ్బెమ్మ నీవు
పుష్పాన పెరిగావు గొబ్బెమ్మ నీవు
రాచకొండల మీద రాగాల మేన
నీ నోము నాకియ్యవే నాకొక్క వరమియ్యవే

ధూపాన పుట్టావు గొబ్బెమ్మ నీవు
ధూపాన పెరిగావు గొబ్బెమ్మ నీవు
రాచకొండల మీద రాగాల మేన
నీ నోము నాకియ్యవే నాకొక్క వరమియ్యవే

దీపాన పుట్టావు గొబ్బెమ్మ నీవు
దీపాన పెరిగావు గొబ్బెమ్మ నీవు
రాచకొండల మీద రాగాల మేన
నీ నోము నాకియ్యవే నాకొక్క వరమియ్యవే

నైవేద్యాన పుట్టావు గొబ్బెమ్మ నీవు
నైవేద్యాన పెరిగావు గొబ్బెమ్మ నీవు
రాచకొండల మీద రాగాల మేన
నీ నోము నాకియ్యవే నాకొక్క వరమియ్యవే

తాంబూలాన పుట్టావు గొబ్బెమ్మ నీవు
తాంబూలాన పెరిగావు గొబ్బెమ్మ నీవు
రాచకొండల మీద రాగాల మేన
నీ నోము నాకియ్యవే నాకొక్క వరమియ్యవే

హారతిన పుట్టావు గొబ్బెమ్మ నీవు
హారతిన పెరిగావు గొబ్బెమ్మ నీవు
రాచకొండల మీద రాగాల మేన
నీ నోము నాకియ్యవే నాకొక్క వరమియ్యవే 


 

Comments

Popular posts from this blog

Margazhi Magic: Unpacking India's Most Spiritual (and Sometimes Controversial!) Month

Mudakaratha Modakam Meaning, Benefits & Lyrics | Ganesha Pancharatnam by Adi Shankaracharya